ఇండియాలోనే రికార్డ్ ..ట్రక్కు డ్రైవర్ కు రూ.86 వేల ఫైన్

కొత్త మోటార్ వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.రూల్స్ బ్రేక్ చేసిన వారికి చలాన్లతో బెంబేలెత్తిస్తున్నారు. వాహనాల కంటే వారు వేసే చలాన్లే ఎక్కువ ఉంటున్నాయి. ఇటీవల ఓ ఆటో డ్రైవర్ కు రూ.25 వేలు ఫైన్ వేయడం మనం చూశాం. లేటెస్ట్ గా ఓడిశాలో ఓ ట్రక్కు డ్రైవర్ కు రూ.86,500 చలాన్ వేశారు. ఇది ఇప్పటి వరకు దేశంలో అత్యధిక చలానాగా రికార్డ్.

సెప్టెంబర్ 3 న నాగాలాండ్‌కు చెందిన బిఎల్‌ఎ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ట్రక్కుపై  జేసీబీనీ తీసుకెళ్తున్నారు. అంగుల్ జిల్లాలోని తల్చేర్ పట్టణం నుండి ఛత్తీస్‌గడ్ కు వెళుతుండగా సంబల్పూర్‌లో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని డ్రైవర్ జాదవ్ కు ఫైన్ వేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.5 వేలు, అనర్హుడికి వాహనం ఇచ్చినందుకు రూ.5 వేలు,18 టన్నుల అదనపు లోడ్ ను తీసుకెళ్తున్నందుకు రూ.56 వేలు, పరిమితికి మించి లోడుతో ప్రయాణం చేస్తున్నందుకు రూ. 20 వేలు, ఇతర తప్పిదాలకు కలిపి మరో రూ.500 ,ఇలా మొత్తం కలిపి రూ.86,500 ఫైన్ వేశారు డ్రైవర్ కు.  ఆ అధికారులతో నాలుగైదు గంటలు చర్చించిన తర్వాత చివరకు రూ.70 వేల ఫైన్ కట్టి వెళ్లిపోయాడు డ్రైవర్.

Latest Updates