నటి రేఖ చేతికి హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసిన అధికారులు

బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. అలనాటి అందాల నటి రేఖ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తన సెక్యూరిటీ గార్డుతో పాటు, ఇద్దరు పనివాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో.. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఆమె బంగ్లాను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. అంతే కాకుండా బంగ్లా  బయట కంటైన్మెంట్ ఏరియా అనే బోర్డును కూడా ఏర్పాటు చేశారు.

మరోవైపు ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో… వారంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అమితాబ్ నివాసం ‘జల్సా’కు కూడా అధికారులు సీల్ వేసి, కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు.

Latest Updates