
కళ్యాణ లక్ష్మి పథకం పెడదారి పడుతుంది. ప్రభుత్వం వరమిచ్చినా అధికారులు అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు అంటున్నారు. ఇందులో బాగంగా.. సికింద్రాబాద్ తుకారం గేటుకు చెందిన సుధారాణి అనే మహిళ కొద్ది రోజుల క్రితం కళ్యాణ లక్ష్మి కోసం అప్లై చేసుకుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ధనం సుధారాణికి చేరాలంటే తనకు లంచం ఇవ్వాల్సిందేనని స్పెషల్ ఆర్.ఐ ఉమర్ కోరాడు. దీంతో అతనికి ఏడు వేల లంచం ఇచ్చానని సుధారాణి తెలిపింది. అయితే సుధారాణి పిర్యాదు మేరకు… ఏసీబీ అధికారులు ఉమర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతని సహాకరించిన అటెండర్ ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్డర్స్ ఇచ్చారు జిల్లా కలెక్టర్.
విచారణ నిమిత్తం ఉమర్ కు సంబంధించిన పలు ఫైళ్లను తనిఖీ చేశారు ఏసీబీ అధికారులు. దీంతో ఉమర్ పై పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో ఉమర్ పలువురిని ఇబ్బంది పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.