
7 గ్రామాలకు సప్లయ్ ని లిచిపోవడంతో జనం ఇబ్బందులు
సీఎం కాళేశ్వరం టూర్ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణం కోసం ఆఫీసర్లు 10 కరెంట్ స్తంభాలను కూల్చారు. దీంతో 7 గ్రామాల ప్రజలు రోజంతా కరెంట్ లేక ఇబ్బందులు పడ్డా రు. మామూలుగా సీఎం వచ్చిన ప్రతి సారీ టెంపుల్‌కి 2 కి లోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్ వద్ద హెలి ప్యాడ్‌లో దిగేవారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కాళేశ్వరం టెం పుల్ వచ్చేవారు. కన్నె పల్లి పంప్‌హౌస్ వద్ద ఇప్పటికే మూడు హెలిప్యాడ్లను ప్రభుత్వం రెడీ చేసింది. కానీ ఈ సా రి అధికారులు కొత్తగా కాళేశ్వరం టెం పుల్ దగ్గర్లో ని ఓ ప్రైవేట్ వ్య క్తి స్థ లంలో హెలిప్ యాడ్ నిర్మిం చాలని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నా రు. మంగళవారం ఉదయం అక్కడికి వచ్చిన ఏవియేషన్ ఆఫీసర్లు హెలికాప్టర్ ది గడానికి కరెంట్ స్తంభాలు అడ్డుగా ఉన్నాయని చెప్పడంతో మరో ఆలోచన లే కుండా 10 స్తంభాలను కూలగొట్టా రు. దీంతో అన్నా రం, చండ్రుపల్లి, నాగెపల్లి, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం , దు బ్బగూడెం గ్రామాలకు రోజంతా కరెం ట్ సరఫరా నిలిచిపోయింది . ట్రాన్స్ కో ఆఫీసర్లు సా యంత్రంనుంచి కరెంట్ స్తం భాలను తిరిగి పాతుతున్నారు