ఎన్ కౌంటర్ పై సీపీ సజ్జనార్ అధికారిక ప్రకటన

దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్  నిర్ధారించారు. నిందితులు మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు ఇవాళ తెల్లవారుజామున షాద్ నగర్, చటాన్ పల్లి దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన 3 నుంచి 6 గంటల మధ్య జరిగిందని తెలిపారు. తాను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించానని తెలిపారు సజ్జనార్.

Latest Updates