బాలకార్మికులను రక్షించిన అధికారులు

officials of CR commercial wing, NGOs rescued 50 childrens

బీహార్ నుంచి నగరానికి పనుల కోసం తీసుకొస్తున్న చిన్నారులను లేబర్ డిపార్ట్​మెంట్ , పిల్లల సంరక్షణ శాఖలు కాపాడాయి. సుమారుగా 50మంది  చిన్నారులను  పాట్నా నుంచి రైలులో ఇక్కడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న లేబర్ డిపార్ట్​మెం ట్, పిల్లల సంరక్షణ శాఖ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. పాట్నా నుంచి వస్తున్న రైలు సరిగ్గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను చేరుకోగానే చిన్నారుల బోగి వద్దకు వెళ్లిన బృందం వారిని కాపాడింది. రైలులో వస్తున్న పిల్లలకు తాము ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. దీనికి కారకులైన వారి గురించి ఆరా తీస్తున్నారు.

బీహార్ నుంచి తీసుకొస్తున్న చిన్నారులను ఇక్కడి ఒక కంపెనీలో పనికి ఒప్పం దం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. రక్షించిన చిన్నారులను స్వచ్ఛంద సంస్థ ద్వారా నడుస్తున్న చిల్డ్రన్ హోమ్ కు తరలించినట్లు తెలిసింది. బుధవారం చిన్నారులను సీడబ్ల్యూసీ ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే, బాలకార్మికుల తరలింపు వెనుక ఉన్న ముఠాలో ఏ ఒక్కరిని వదలిపెట్టేది లేదని, బాలకార్మికల చట్టాలప్రకారం సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని లేబర్ డిపార్ట్​మెంట్, జిల్లా పిల్లల సంరక్షణ అధికారులు స్పష్టం చేశారు. బాలకార్మికతరలింపు వెనుక ముఠా ఇతరత్రా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఆపరేషన్‌‌ కార్మికశాఖ అధికారి గంగాధర్, జిల్లా పిల్లల సంరక్షణ అధికారి ఇంతియాజ్, పోలీసు, జీఆర్పీ, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 40మంది నాగ్పూ ర్, 16 మంది కాగజ్ నగర్ లో కాపాడారు. బీహర్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. సమాచారంతోనే కార్మిక శాఖ జిల్లా పిల్లల సంరక్షణ అధికారి ఇంతియాజ్, పోలీసు, జీఆర్ పీ, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest Updates