నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు : సమంత

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఓ బేబీ. ఎంత సక్కగున్నావే అనే ట్యాగ్ లైన్ ఉన్న ఈ మూవీని దర్శకురాలు నందినీరెడ్డి రూపొందించారు. ఈ మూవీ ప్రకటించినప్పుడే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయింది. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది.

ఓ బేబీ మూవీ… ఓ ఫాంటసీ కామెడీ డ్రామా ఫిలిం. సౌత్ కొరియన్ ఫిలిం మిస్ గ్రానీ ఆధారంగా ఓ బేబీ తెరకెక్కించారు. ఓ మిస్టీరియస్ ఫొటో స్టూడియోలో 70 ఏళ్ల వృద్ధురాలు ఫొటో తీయించుకున్నప్పుడు… ఆమె తన 25ఏళ్ల వయసులోకి మారిపోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నాయనేదానిని కామెడీగా చూపించామని దర్శక నిర్మాతలు తెలిపారు.తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసినట్టు చెప్పారు.

సమంతతో పాటు.. సినిమాలో మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి లక్ష్మి నటించారు. నాగశౌర్య, ఊర్వశి, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, స్నిగ్ధ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్ ఈ మూవీని నిర్మించాయి. త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Latest Updates