జాబిల్లి ఫొటోలు తీసిన ఆర్బిటర్

  • బొగు స్లాస్కీ క్రేటర్​ను క్లిక్​మనిపించిన ఓహెచ్​ఆర్​సీ

చంద్రయాన్​ 2 ఆర్బిటర్​లోని హై రిజల్యూషన్​ కెమెరా (ఓహెచ్​ఆర్​సీ) మరోసారి జాబిల్లి ఫొటోలను తీసింది. సెప్టెంబర్​ 5న 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి చందమామను క్లిక్​మనిపించింది. దక్షిణ ధ్రువంపై ఉన్న బొగుస్లాస్కీ ఈ క్రేటర్​ (జర్మనీ ఆస్ట్రానమర్​ అయిన పెలోన్​ హెచ్​. లుడ్విగ్​ వోన్​ బొగుస్లాస్కీ పేరునే ఆ ప్రాంతానికి పెట్టారు) ప్రాంతాన్ని ఫొటోల్లో ఒడిసి పట్టింది. ఆ లోయ 14 కిలోమీటర్ల వ్యాసం, 3 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ​ఆ లోయలోని మరో రెండు చిన్న లోయలు, అక్కడ ఉన్న బండరాళ్లనూ క్లియర్​గా చూపించింది. ఓహెచ్​ఆర్​సీ తీసిన ఆ ఫొటోలను ఇస్రో తన వెబ్​సైట్​, ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. కాగా, విక్రమ్​ ల్యాండింగ్​ ఫెయిలవడం వెనక కారణాల గురించి అమెరికా గానీ, నాసా గానీ ఏమీ చేయలేదని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి విల్బర్​ రాస్​ అన్నారు. శుక్రవారం బెంగళూరులో ఆయన ఇస్రో చీఫ్​ శివన్​ను కలిశారు. విక్రమ్​ నుంచి కమ్యూనికేషన్​ కట్​ అయిపోవడం ఇండియా అంతర్గత విషయమన్నారు. ల్యాండర్​కు ఏం జరిగిందో తేల్చడం చాలా కష్టమైన పని అన్నారు. విక్రమ్​కు ఏమైందో కనిపెట్టే బాధ్యత ఇస్రోదేనని, విక్రమ్​ మళ్లీ లైన్​లోకి వస్తుందన్న నమ్మకం తనకుందని నాసా జెట్​ప్రొపల్షన్​ లేబొరేటరీ స్పేస్​క్రాఫ్ట్​ సిస్టం ఇంజనీరింగ్​ మేనేజర్​ యాన్​ డెవెరాక్స్​ అన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేసిన వరల్డ్​ స్పేస్​ వీక్​లో ఆయన మాట్లాడారు. విక్రమ్​తో కనెక్షన్​ కట్​ అయి నెల గడుస్తున్నా దాని జాడను తెలుసుకోవడానికి ఇస్రో సైంటిస్టులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. జాబిల్లిని విక్రమ్​ ఎలా, ఎక్కడ ఢీకొట్టిందో తెలియదన్నారు. ఇక, కోల్​కతాలోని అమెరికన్​ సెంటర్​లో స్టూడెంట్లతోనూ ఆమె మాట్లాడారు. ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

Latest Updates