ఓకే క్రెడిట్‌కు రూ.476 కోట్లు

న్యూఢిల్లీ : చిన్న మర్చెంట్లు రోజువారీ కొనుగోళ్లను, అమ్మకాలను ట్రాక్ చేసుకునేందుకు ఉపయోగపడే మొబైల్ యాప్ ఓకేక్రెడిట్‌ 67 మిలియన్ డాలర్లను( రూ.476 కోట్ల) నిధులను సేకరించింది. లైట్‌స్పీడ్, టైగర్‌‌ గ్లోబల్‌ నుంచి ఈ మొత్తాన్ని పొందినట్టు తెలిపింది. గత రెండు నెలల నుంచి ఓకే క్రెడిట్ 83 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఓకేక్రెడిట్‌పై 65 లక్షల మర్చెంట్లు రిజిస్టర్ అయి ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మర్చెంట్ల సంఖ్య 100 టైమ్స్ పెరిగింది. ఇండియాలోని ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో లైట్‌స్పీడ్‌ చాలా ఏళ్ల నుంచి పెట్టుబడులు పెడుతోంది.

 

Latest Updates