బాంబ్ అటాక్ ను తట్టుకుని బతికిన చెట్టు

24 ఏళ్ల క్రితం అమెరికాలోని ఒక్లహామాలోజరిగిన అత్యంత దారుణమైన బాంబ్ అటాక్ కు ప్రత్యక్ష సాక్షి ఆ ఎల్మ్​ ట్రీ. ఆ దాడిని తట్టుకుని ఇన్నేళ్లు నిలిచింది. నెమ్మదిగా కోలుకుని తన పేరునే ‘సర్వైవల్​ ట్రీ’గా మార్చుకుంది. హోప్ కు సింబల్​గా మారింది.ఇప్పుడు హోప్ ట్రీని రక్షించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి . దాని డీఎన్ఏని సేకరించేందుకు సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. 1995 ఏప్రిల్​ 19న ఒక్లహామాలోని ఆల్ఫ్రెడ్​ పి.ముర్రా ఫెడరల్​ బిల్డింగ్ వద్ద భారీపేలుడు జరిగింది. పెద్దలు, పిల్లలు కలిపి 168 మందిఆ దాడిలో మరణించారు. ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలతో పేలుడుకు పాల్పడటంతో బిల్డింగ్ సగం కూలిపోయింది. ఆ బిల్డింగ్ ను ఆనుకుని ఉన్న ఎల్మ్​ ట్రీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం ఒక్లహామా సిటీ నేషనల్​ మెమోరియల్​లో ఈ చెట్టు ఉంది. అక్కడ చనిపోయిన వారికి గుర్తుగా 168 కుర్చీలను ఏర్పాటుచేశారు. ఆ చెట్టు కొద్దికొద్దిగా రికవరీ అవుతూ 24ఏళ్లు బతికింది. ప్రస్తుతం ఆ చెట్టు వయసు వందేళ్లు.సాధారణంగా ఎల్మ్​ ట్రీ 150 ఏళ్లు బతుకు తుంది.అయితే బాంబు పేలుడుకు గురి కావడంతో ఈ చెట్టుఎప్పుడు చనిపోతుందో తెలియని పరిస్థితి. బాంబుపేలుడు జరిగిన 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోకల్​ లీడర్లు, అధికారులు శుక్రవారం.. క్లోన్ ​చేసిన ఎల్మ్​ ట్రీని నాటారు. సర్వైవల్​ ట్రీ సీడ్​ ద్వారా పెరిగినమరో చెట్టు మొదళ్ల నుంచి డీఎన్ఏను సేకరించి దీనికి ప్రాణం పోశారు. సర్వైవల్​ ట్రీ చనిపోయిన తర్వాత దాని స్థానంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం నర్సరీ వర్కర్లు కొత్త చెట్టు ను ప్రత్యేకంగా రూపొందించిన ఓ చోటుకు తరలించారు. ఇది ఒరిజినల్​ ట్రీ ఉన్న ప్రాంతానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొత్త చెట్టును మొదళ్లతో పాటుతరలించే మెషినరీని ఈ సిద్ధంగా ఉంచారు.

 

Latest Updates