ఓలా ఖాతాదారు కారు ఎత్తుకెళ్లిన ఏజెంట్లు

పని ఇచ్చిన సంస్థకే కన్నం వేశారు ఇద్దరు ఉద్యోగులు. నగరంలోని ఓలా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రికవరీ ఏజెంట్లుగా పని చేస్తున్న నసెర్ ఖాన్ , ఖాజా , ఇమ్రాన్ అనే ముగ్గురు వ్యక్తులు తమ కంపెనీ ఖాతాదారైన యూసఫ్ యొక్క వాహనాన్ని చోరీ చేశారు.

ఆ సంస్థ నుంచి వాహనం కొనుగోలు చేసిన యూసఫ్.. రెండు నెలల నుంచి కిస్తులు కట్టకపోవడంతో అతని కారును రికవరీ చేస్తామని ఆ ముగ్గురూ  కారును దొంగలించారు. తమ ఇన్ ఛార్జ్ సయ్యద్ నస్రుల్ హుస్సేన్ కు చెప్పకుండా ఆ కారును షాహీన్ నగర్ నుంచి దొంగలించి తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన నసెర్ కు రూ.60 వేలకు అమ్మివేశారు

వారిపై అనుమానం వచ్చిన ఇంచార్జ్ హుస్సేన్ బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని  పట్టుకుని విచారణ జరిపగా చేసిన నేరాన్ని అంగీకరించారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకొని, వారిని జైలు కు తరలించారు.

Latest Updates