బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన

జీడిమెట్ల, వెలుగు: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వృద్ధుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల పరిధిలోని ఓ ప్రాంతంలో ఉండే సోమయ్య(70) ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అతడి భార్య పనికి వెళ్లగానే రోజూ గల్లీలో ఆడుకునే బాలిక(7)ను పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవాడు. సోమవారం ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి అరవడంతో స్థానికులు అక్కడి కి చేరుకున్నారు. సోమయ్యను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు

Latest Updates