ముసలమ్మను రోకలి బండతో కొట్టి…

old-woman-murder-in-sanathnagar-hyderabad

హైదరాబాద్: సనత్ నగర్ శివాజీ నగర్ లో ఓ ముసలమ్మను రోకలి బండతో కొట్టి చంపేశారు గుర్తుతెలియని వ్యక్తులు. సుందరమ్మ(80) అనే ముసలమ్మ ను మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియాని వ్యక్తులు రోకలిబండతో తలపై కొట్టి హత్యచేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. సుందరమ్మ ముగ్గురు కొడుకులు. వీరు వేరువేరుగా బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే కుటుంబసభ్యులే ముసలమ్మను చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates