తల్లి బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్

oldage-mother-land-son

వృద్ధాప్యంలో యోగక్షేమాలు చూడని ఓ కొడుకు భూమి కోసం తల్లి చనిపోయిందని తప్పుడు పత్రాలు సృష్టించాడు. బతికుండగానే తన తల్లి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ పొంది, ల్యాండ్ ను తన పేరుమీద చేసుకోబోయాడు ఆ పుత్రరత్నం. ఈ సంఘటన మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలో జరిగింది.  రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడైన ఓ ప్రజా అధికారి.. తన తల్లి చనిపోయిందని తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఎలగైనా భూమిని పట్టా చేయాలని VROపై ఒత్తిడి చేశాడు.

అసలు విషయం భూమి యజమాని అయిన వృద్ధురాలికి తెలియడంతో.. నేను బతికే ఉన్నానని రిజిస్ట్రేషన్ ను ఆపాలని కలెక్టర్ ​కు ఫిర్యాదు చేసింది తల్లి. ‘నేను బతికే ఉన్నాను చనిపోలేదు’ అని రాసిన ఉన్న ఓ ఫ్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది ఆ ముసలవ్వ.

Latest Updates