50 ఏళ్లు దాటిన హీరోలపై సోనాక్షి సిన్హా వ్యాఖ్యలు

మనసులో ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటారు. కొందరు. అలాంటప్పుడు సాధారణ వ్యక్తులకే బోలెడు సమస్యలు వస్తాయి. ఇక సెలెబ్రిటీలకైతే ఎలా ఉంటుంది! రీసెంట్‌‌గా సోనాక్షి మాట్లాడిన మాటలు కూడా ఆమెను సమస్యల్లోకి నెట్టాయి. ఇండస్ట్రీలో హీరోల గురించి మాట్లాడుతున్నప్పుడు.. యాభయ్యేళ్లు దాటిన హీరోలు ఇరవయ్యేళ్లున్న హీరోయిన్లతో రొమాన్స్‌‌ చేస్తే బాగుంటుందా అనేప్రశ్న ఎదురైంది సోనాక్షికి. దానికామె‘అస్సలు బాగోదు. నాకు యాభయ్యేళ్లు వచ్చాక యంగ్ హీరోతో నటించమంటే నటించను’ అంది. మరి సల్మాన్‌ నటిస్తున్నాడు కదా అంటే.. ఆవిషయం తననే అడగమని చెప్పింది. అక్కడితో వదిలేయకుండా.. అతడు యాక్టర్​గా బెటరవుతూ వచ్చి పెద్ద స్టార్ అయిపోయాడని, అందుకే సల్మాన్‌ తో నటించాలని హీరోయిన్లంతా ఆశపడతారని అంది.

దాంతో సోషల్ మీడియాలో ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు.అందరికీ వర్తించేవి సల్మాన్‌ కి వర్తించవా, నువ్వు సల్మాన్‌ కి చెంచావి అని ఒక నెటిజన్‌ అన్నాడు. అసలు యాక్టింగే రాకపోయినా మీ నాన్నవల్ల ఇండస్ట్రీలోకొచ్చి బతికేస్తు న్నావ్​అని మరో నెటిజన్ అన్నాడు. ఇది తలనొప్పి గా తయారైంది సోనాక్షికి.నాకు మొదటి సినిమా చాన్స్ ఇచ్చాడు కనుక సల్మాన్ అంటే నాకు అభిమానమేఅంటోంది. నా అభిప్రాయాలు నావి, ఎవరెలా అనుకుంటే నాకేంటి అని ప్రశ్నిస్తోంది. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఏ విషయంలో తనని ట్రోల్ చేసినా లెక్క చేయలేదు సోనాక్షి. తనఅభిప్రాయాల విషయంలో ఎప్పుడూ నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఆ మాత్రం స్ట్రాంగ్‌‌నెస్ అవసరమేనేమో.

Latest Updates