ఆర్ ఆర్ ఆర్ మూవీలో హాలీవుడ్ స్టార్స్.. ఎన్టీఆర్ సరసన లండన్ బ్యూటీ

ఆర్ఆర్ ఆర్ మూవీ కోసం బాలీవుడ్ నటీనటుల్ని ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. రాజమౌళి డైరక్షన్ లో 400కోట్ల భారీ బడ్జెట్ తో  రామ్ చరణ్  – ఎన్టీఆర్ హీరోలుగా “ఆర్ ఆర్ ఆర్” సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ  సినిమా షూటింగ్ 70శాతం పూర్తైయ్యింది. ఈ సందర్భంగా బ్యాక్ డ్రాప్ షూటింగ్ కోసం నెగిటీవ్ షేడ్స్ లో యాక్ట్ చేసేందుకు బాలీవుడ్ నటీనటుల్ని ప్రేక్షకుల్ని పరిచయం చేసింది చిత్ర యూనిట్. స్కాట్ పాత్ర కోసం ఐరిష్ యాక్టర్ రేస్టీవెన్ సన్ ను, లేడీ విలన్ పాత్ర కోసం ఆలిసన్ డూడ ను తీసుకున్నట్లు తెలిపింది.

సినిమా తొలి ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ సరసన యాక్ట్ చేసేందుకు డైసీ ఎడ్గర్ జోన్స్ ను తీసుకున్నట్లు రాజమౌళి ప్రకటించారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి డైసీ తప్పుకుంది. అందుకే ఎన్టీఆర్ కు జోడీగా జెన్నీఫర్ పాత్ర కోసం లండన్ బ్యూటీ ఓలీవీయా మోరీస్ ను ఫైనల్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

Latest Updates