OLXలో పాత కారు అమ్ముతామంటూ నైజీరియన్ మోసం.. అరెస్ట్

హైదరాబాద్ :  మరో ఆన్ లైన్ మోసానికి హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ఆన్ లైన్ లో.. ఓఎల్ఎక్స్ సైట్ లో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతామంటూ .. డబ్బులు తీసుకుని.. మోసానికి పాల్పడుతున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇనోవా కారు ఫొటోలు పెట్టిన ఓ నైజీరియన్… హైదరాబాద్ మీర్ చౌక్ కు చెందిన మహ్మద్ మోసిన్ అనే వ్యక్తినుంచి అడ్వాన్స్ అడిగాడు.

కారు కొనేందుకు అడ్వాన్స్ గా రూ.85 వేల నగదును ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయాలని నైజిరియన్ కోరాడు. ఫొటోలోనే కార్ ను ఓకే చేసిన మోసిన్.. రూ.85వేలు పంపించాడు. మరికొంతమంది మనీ ట్రాన్స్ ఫర్ చేయాలని నైజీరియన్ కోరడంతో… మోసిన్ కు డౌట్ వచ్చింది. సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు… నిందితుడు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.  ఐపీ అడ్రస్ ల ఆధారంగా.. బెంగళూరులో నైజీరియన్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates