కిలాడీ లేడీ అరెస్ట్ : OLX అడ్డాగా మోసాలు

ఎల్ బీ నగర్, వెలుగు : ఓఎల్ఎక్స్ లో ఫోన్ లు కొంటానని చెప్పి స్మార్ట్​ ఫోన్లను చోరీ చేస్తున్న యువతిని ఎల్ బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ గుంటూర్ కు చెందిన అల్లూరి భాను అరవింద చౌదరి(24) అనే యువతి కొంత కాలం క్రితం ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది. అప్పటి నుండి నగరంలోని సరూర్ నగర్ లో నివాసం ఉంటోంది. అవసరాలకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఈజీగా డబ్బు సంపాదించాలనుకుంది. దానికి ఓ ఎల్‌‌ఎక్స్ ను వేదికగా చేసుకుంది. మొదటగా ఓ ఎల్‌‌ఎక్స్ లో అమ్మకానికి ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్లను చూస్తుంది. తర్వాత అందులో ఉన్న ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తనకు ఆ మొబైల్ ఫోన్ నచ్చిందని తాను ఫోన్ కొంటాని చెప్పి వెనకనుండి పారిపోవదానికి వీలుగా ఉన్న ఇంటిని ఎంచుకుంటుంది. ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళి మొబైల్ ఫోన్ అమ్మే వారికి లొకేషన్ షేర్ చేస్తుంది. మొబైల్ అమ్మడానికి అక్కడికి చేసుకున్న వారి నుంచి ఆ ఫోన్ తీసుకొని పక్కన ఉన్నది తన ఇల్లేనని మా మమ్మీ వాళ్ళకు ఫోన్ చూపించి వస్తానని నమ్మిస్తుంది.

అక్కడి నుండి ఇంట్లోకి వెళుతున్నట్లుగానే ఇంటి గేట్ ఓపెన్ చేసి అదే ఇంటి వెనక నుంచి పరారవుతుంది. ఇలా నాలుగు చోరీలకు పాల్పడిన యువతి 3.40 లక్షల విలువైన మూడు ఆపిల్(ఐ ఫోన్)లతో పాటు విలువైన శ్యాంసంగ్ ఫోన్ చోరీ చేసింది. చోరీ చేసిన ప్రతిసారి ఫోన్ నంబర్ మారుస్తుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన కాటిక మహేశ్ అనే వ్యక్తి తన తన శ్యాంసంగ్ 6s ఫోన్ ను గత నెల 3న అమ్మకానికి ఓ ఎల్‌‌ఎక్స్ లో పెట్టాడు. ఆన్ లైన్ లో పెట్టిన రెండు రోజుల్లోనే ఈ యువతి ఇదే తరహాలో ఎల్ బీ నగర్ లోని శాతవాహన నగర్ కు పిలిపించి చోరీ చేయడంతో ఆ ఇంట్లోకి ప్రవేశించిన మహేశ్ ఆ ఇంటి వారిని మీ అమ్మాయి నా ఫోన్ తీసుకొని వచ్చిందని అడిగాడు. అసలు తమకు అమ్మాయే లేదు ఎవరు నువ్వు అని ప్రశ్నించడంతో తాను మోసపోయానని గ్రహించిన మహేశ్.. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేష న్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్స్ నంబర్ ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేసి చోరీ చేసిన మూడు ఐ ఫోన్ లతో పాటు ఒక శ్యాంసాంగ్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన డిఎస్ఐ మరయ్యతో పాటు క్రైమ్ టీం శివరాజ్, బోస్, బాలకృష్ణ, యల్లయ్య, విజయ్, జంగయ్య, రాజేందర్ లను ఉన్నతధికారులు అభినందించారు.

Latest Updates