లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక

17వ లోక్‌సభ స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల నుంచి స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో బిర్లా ఎన్నిక ఏకగ్రీవమైంది. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ సభలో ప్రకటించారు. తర్వాత ఓం బిర్లాను స్పీకర్‌ చైర్‌ దగ్గరకు సభా నాయకుడు మోడీ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓం బిర్లాకు సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు స్పీకర్‌ పదవికి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. మోడీ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షాతో పాటు పలువురు సమర్థించారు.

 

Latest Updates