నిండు గర్భిణిని హత్య చేసిన అత్త

ఆగ్రా : అత్తాకోడళ్ల గొడవ ప్రాణంమీదికి తెచ్చిన ఘటన ఆగ్రాలో జరిగింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా అత్త కోడలిని దారుణంగా చంపేసింది. అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకున్న తీవ్ర వాగ్వాదం.. హత్య దాకా దారి తీసింది. కోడలిని ఓ గదిలోకి తీసుకెళ్లింది అత్త. తర్వాత కోడలి గొంతును కత్తితో కోసి హత్య చేసింది. పలుమార్లు ఆమె శరీరంపై కత్తితో పొడిచింది. ఆ తర్వాత అత్త కూడా అదే కత్తితో పొడుచుకుంది. కుటుంబ సభ్యులు ఈ ఘటనను గమనించి.. అత్తాకోడళ్లు ఉన్న గది తలుపులు విరగొట్టారు. కోడలు ప్రాణాలు కోల్పోగా.. అత్త కొన ఊపిరితో ఉంది. దీంతో ఆమెను ట్రీట్ మెంట్ కోసం స్టానిక హస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates