హైదరాబాద్ నుంచి ఒమన్ జాతీయుల తరలింపు 

కరోనాను అరికట్టడంలో భాగంగా భారతదేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనా రిలీఫ్ తో పాటు తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తోంది GMR ఆధ్వర్యంలోని(శంషాబాద్ ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. భారతదేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారిని సరిహద్దులు దాటిస్తూ తన వంతు సేవలను అందిస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం  ఇవాళ్టి (సోమవారం,మే 18) వరకు 14 డిపార్చర్ తరలింపు విమానాలను హ్యాండిల్ చేసి, 1000 మందికి పైగా విదేశీయులను వారి స్వదేశాలకు తరలించింది. అంతే కాకుండా వందే భారత్ మిషన్ కింద 9 అరైవల్స్  ఎవాక్యుయేషన్స్ విమానాలు కూడా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. వీటి ద్వారా సుమారు 1500 మంది భారతీయులను ఇతర దేశాల నుంచి మన దేశానికి తరలించారు. రెండో దశ వందే భారత్‌లో భాగంగా ఇవాళ( సోమవారం) సాయంత్రం ఒక విమానం మస్కట్ నుంచి హైదరాబాద్ రానుంది.

…ఇవాళ తెలంగాణలో చిక్కుకుపోయిన కొందరు ఒమన్ జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు ఒక ప్రత్యేక విమానం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లింది.  స్టార్ ఎయిర్‌కు చెందిన OG 9111 విమానం  ఉదయం 7.12 గంటలకు 28 మంది ఒమన్ జాతీయులతో ముంబైకు బయలుదేరి వెళ్లింది. ముంబై నుంచి వీరిని మరో ఎయిరిండియా విమానం ద్వారా ఒమన్ తరలిస్తారు.

… సాయంత్రం వందే భారత్ మిషన్ రెండో దశలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ IX 818 మస్కట్ (ఒమన్) నుంచి సాయంత్రం 5.35 గంటల సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులతో హైదరాబాద్ కు రానుంది.

ఒమన్ జాతీయుల తరలింపు

…ఒమన్ జాతీయులను పూర్తిగా శానిటైజ్ చేసిన అంతర్జాతీయ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ (IIDT) ద్వారా వారి స్వదేశానికి పంపడం జరిగింది. టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.

…స్పెషల్ స్క్రీనింగ్, పలు భద్రతా చర్యల తర్వాత, భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్ ను దాటుకుని విమానంలోకి వెళ్లారు.

…ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి GHIAL కు చెందిన టెర్మినల్ ఆపరేషన్స్ సిబ్బంది, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్, AOCC, ATC, ల్యాండ్ సైడ్ సెక్యూరిటీ, సీ.ఐ.ఎస్.ఎఫ్., ఇమిగ్రేషన్, కస్టమ్స్, APHO (ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్), ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాండ్లర్లు, ARFF (ఎయిర్ పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్) సేవలు RAXA సెక్యూరిటీ, ట్రాలీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

Latest Updates