OMG : తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ హ్యాక్

omgతెలుగుదేశం పార్టీలో కలకలం. ఆ పార్టీ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్.. టీడీపీ అధికారిక వెబ్ సైట్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. హోం పేజీలోనే.. వాళ్ల సమాచారం పోస్ట్ చేశారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో.. హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించారు. పేజీలో Anonplus అనే కంపెనీ పేరుతో రాతలు ఉన్నాయి. Anonplus వెబ్ సైట్ కి సంబంధించిన సమాచారం అంతా కూడా… telugudesam.org  హోంపేజీలోకి వచ్చేసింది. పార్టీ అధికారిక సైట్ ఇలా హ్యాక్ కావటం పార్టీలో కలకలం.

టీడీపీ ప్రభుత్వంలోనే కాకుండా పార్టీ ఐటీ విభాగాలను సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఐటీ విభాగం పని చేస్తుంది. అలాంటిది టీడీపీ అధికారి వెబ్ సైట్ హ్యాక్ చేసి సవాల్ విసిరారు హ్యాకర్లు. మళ్లీ తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీ విభాగం సిబ్బంది.. పార్టీ వెబ్ సైట్ నే కాకుండా.. ప్రభుత్వానికి సంబంధించిన ఇతర వెబ్ సైట్లను పరిశీలిస్తున్నారు. హ్యాకింగ్ వెనక రాజకీయ ఉద్దేశం ఎవరికైనా ఉందా.. ఎవరు పని అనేది కూడా విచారిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates