OMG : బొమ్మ తుపాకీ అనుకుని.. అమ్మను కాల్చేసింది

toy-gunపశ్చిమబెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లాలో ఊహించని విషాదం. అరంబాగ్ లోని కనకుల్ ప్రాంతంలో జరిగిన ఓ ఘోరం కలకలం రేపుతోంది. కనకుల్ ఏరియాలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంటి పక్కన పార్క్ ఉంది. ఆదివారం కావటంతో కూతురు కకోలి జనతో కలిసి పార్క్ కు వెళ్లింది తల్లి. వారికి అక్కడ ఓ తుపాకీ దొరికింది. అయితే అది బొమ్మ పిస్టోల్ అనుకున్న తల్లి.. దాన్ని ఆడుకోమని స్వయంగా కూతురికి ఇచ్చింది. ఆ తుపాకీని తీసుకుని ఇంటికి వచ్చారు తల్లీకూతుళ్లు.

ఇంటికి వచ్చిన చిన్నారి కకోన జన.. తల్లి ఇచ్చిన తుపాకీతో ఆడుకుంటుంది. తుపాకీతో అమ్మను బెదిరిస్తూ అల్లరి చేస్తోంది. అయితే సడెన్ గా తుపాకీ పేలింది. ఓ తూటా తల్లి వెనక భాగంలోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్ధంతో తుపాకీ పేలటం.. కళ్లెదుట తల్లి రక్తపు మడుగులో పడి ఉండటంతో షాక్ అయ్యింది చిన్నారి కకోన జన. చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అరంబాగ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు చిన్నారిని ప్రశ్నిస్తున్నారు. ఆ పాప చెప్పిన వివరాల ప్రకారం తుపాకీ పార్క్ లోకి ఎలా వచ్చింది అనేది విచారణ చేస్తున్నారు. గన్న లో ఆరు బుల్లెట్లు ఉన్నాయని వెల్లడించారు పోలీసులు. ఈ గన్ ఎవరిది.. ఎవరి పేరుపై లైసెన్స్ ఉంది అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఏదిఏమైనా బొమ్మ తుపాకీ అనుకుని తల్లిని కాల్చేసింది ఆ చిన్నారి…

Posted in Uncategorized

Latest Updates