OMG : సాద్వీగా మారిన మెడికో గోల్డ్ మెడలిస్ట్

ఆ యువతి పేరు దీక్ష. వయస్సు 30ఏళ్లు. చదువులో టాప్. టెన్త్ క్లాసులో 94శాతం, ఇంటర్ లో 86శాతం మార్కులతో పాస్ అయ్యింది. ఆ తర్వాత వీకే పాటిల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివింది. గోల్డ్ మెడల్ సాధించింది. అనంతరం మాలెగావ్, దహను, ముంబైలో డాక్టర్ ప్రాక్టీస్ కూడా చేసింది. అనూహ్యంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నది ఆ ఫ్యామిలీ. దీక్ష జైన సాద్వీగా మారింది. ఆసక్తిగ మారిన ఈ విశేషాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర మాలెవగావ్ ప్రాంతానికి చెందిన అశోక్, ధన్వితి ఫ్యామిలీ. పారిశ్రామివేత్తలు. వీరికి ఆరుగురు కుమార్తెలు. పెద్దమ్మాయి 30 ఏళ్ల హీనా డాక్టర్. ఇటీవలే జైన్ సాద్వీగా మారింది. సూరత్ లోని ఆచార్య యశోవర్మ సురిష్వర్ నుంచి సాద్వీగా మారింది. ఇంట్లోవారి మాటలను కాదని.. సాద్వీగా మారింద. డాక్టర్ ఎందుకు చదివారు అంటే.. మా నాన్న కోరిక డాక్టర్ కావాలని అందుకే చదివాను. కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశాను. సాద్వీగా మారాలనేది నా కోరిక అందుకే స్వీకరించాను అని చెబుతోంది హీనా. 17 ఏళ్ల వయస్సు 45 రోజులు జైన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే సాద్వీగా మారాలనే ఆలోచన వచ్చినట్లు చెబుతోంది. తల్లి ధన్వితి కుటుంబం నుంచి ఇప్పటికే 12 మంది సామాజిక సేవలో ఉన్నారు. అదే బాటలో పయనించటానికి తల్లి నిరాకరించినా.. హీనా మాత్రం అటువైపే వెళ్లింది.

Posted in Uncategorized

Latest Updates