OMG : స్పీకర్ కారుకి తప్పిన పెను ప్రమాదం

madhu

అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కారును పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వెహికల్ లారీని ఢీకొట్టింది. జయశంకర్  భూపాలపల్లి జిల్లా గణపురం గ్రామంలో పల్లెప్రగతి నిద్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దేవాదుల పైపులను తీసుకొస్తున్న లారీలు.. ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయిని ఢీకొట్టాయి. డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెహికల్ పక్కకు తప్పించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. యాక్సిడెంట్ తో ఎస్కార్ట్ వెహికల్.. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఎస్కార్ట్ వెహికల్ వెనకాలే వస్తున్న స్పీకర్ కారు తృటిలో ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో.. స్పీకర్ సురక్షితంగా బయటపడ్డారు. భద్రతా సిబ్బంది వాహనం యాక్సిడెంట్ తర్వాత సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్పాట్ నుంచి మధుసూదనాచారిని క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు స్పీకర్ ను ఫోన్ లో సంప్రదించారు.

Posted in Uncategorized

Latest Updates