మరో గేమ్ షోతో ప్రేక్షకుల్ని అలరించనున్న ఓంకార్

బుల్లి తెరపై సక్సెస్‌‌ఫుల్‌‌ యాంకర్లలో ఒకరు ఓంకార్‌‌‌‌. రెగ్యులర్‌‌‌‌గా టీవీ చూసేవాళ్లలో ఈ పేరు గురించి తెలియని వాళ్లుండరు. ఒకప్పుడు ‘ఆట’ షో ద్వారా మంచి ఫాలోయింగ్‌‌ సంపాదించుకున్న ఓంకార్‌‌‌‌ ఆ తర్వాత చాలా టీవీ షోలు చేసి మెప్పించాడు. మధ్యలో సినిమా డైరెక్షన్‌‌ కారణంగా బుల్లితెరకు దూరమయ్యాడు.

ఈమధ్యే ‘రాజుగారి గది–3’ సినిమా చేసిన ఓంకార్‌‌‌‌, తిరిగి మరో టీవీ గేమ్‌‌ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘సిక్స్త్‌‌సెన్స్‌‌’ అనే షో కొత్త సీజన్‌‌ ద్వారా ఆడియెన్స్‌‌ను పలకరించనుంది. ఓంకార్‌‌‌‌, తన సొంత ప్రొడక్షన్‌‌లో ఈ షోను నిర్మిస్తూ, హోస్ట్‌‌ చేస్తున్నాడు. నటులు అలీ, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్‌‌, మంచు లక్ష్మి, యాంకర్‌‌‌‌ సుమ వంటి సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. ‘స్టార్‌‌‌‌ మా’ చానెల్‌‌లో ఈ షో టెలికాస్ట్‌‌ అవుతుంది. ఈమధ్యే ‘బిగ్‌‌బాస్‌‌’ షో ముగియడంతో ఇదే ప్లేస్‌‌లో
‘సిక్స్త్‌‌సెన్స్‌‌ సీజన్‌‌ 3’ని స్టార్‌‌‌‌ మా ప్రసారం చేస్తుంది. ఇది వారంలో రెండు రోజులు అంటే శని, ఆది వారాల్లో మాత్రమే వస్తుంది. రాత్రి తొమ్మిది నుంచి ఈ షో చూడొచ్చు.

Latest Updates