ఆర్టికల్ 370, సీఏఏపై వెనక్కి తగ్గం

జాతి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్​ విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుంటామని, వాటి విషయంలో మరో ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. తన లోక్​సభ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోడీ ఆదివారం పర్యటించారు. రోజంతా బిజీబిజీగా గడిపారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థా పన చేయడం, కాశీ మహాకాల్ ఎక్స్​ప్రెస్ రైలు, వారణాసిలో ఆస్పత్రి సహా పలు ప్రారంభోత్సవాలు చేశారు. తర్వా త బహిరంగ సభలో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్
లో ఆర్టికల్ 370 రద్దు, సిటిజన్ షి ప్ అమెండ్ మెంట్ యాక్ట్​ ల కోసం దేశం సంవత్సరాలుగా ఎదురుచూసిందన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తప్పనిసరని మోడీ చెప్పారు. ఈ విషయంలో అన్నివైపుల నుంచి ఒత్తిడి వస్తున్నా తమ ప్రభుత్వం చలించదని స్పష్టం చేశారు.

అయోధ్యలో సూపర్‌ ఫాస్ట్‌ గా రాముడి గుడి

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు త్వరలో స్పీడందుకుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ‘‘రాముడి గుడి కట్టించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దీంతో నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా జరగనున్నాయి” అని చెప్పారు. గుడి కట్టే విషయంలో ట్రస్ట్​ వేగంగా పనిచేస్తుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య శ్రీరామ్ జన్మభూమి తీర్థ్క్షేత్ర పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసింది. తన లోక్​సభ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోడీ ఆదివారం పర్యటించారు. రోజంతా బిజీబిజీగా గడిపారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థా పన చేయడంతోపాటు కాశీ మహాకాల్ ఎక్స్​ప్రెస్ రైలు, వారణాసిలో ఆస్పత్రి సహా పలు ప్రారంభోత్సవాలు చేశారు.

ఐదేళ్లలో 25 వేల కోట్ల పనులు

గడిచిన ఐదేళ్లలో వారణాసిలో రూ.25 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని ప్రధాని చెప్పారు. ఇందులో కొన్ని పూర్తికాగా.. మరికొన్ని పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయన్నారు. రోడ్లు, హైవేలు, వాటర్ వే, రైల్వేలకు తమ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తోందన్నారు. యూపీ గుండా పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్ వేగంగా దూసుకెళుతోందని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేర్చడంలో టూరిజం కూడా కీలకమేనని చెబుతూ.. అధ్యాత్మి క టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మూడు జ్యోతిర్లిం గాలను కలుపుతూ ఇండోర్, వారణాసిల మధ్య కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందన్నారు. ‘ఒక పౌరుడిగా మన ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ప్రభుత్వాలు మాత్రమే దేశాన్ని తయారుచేయలేవు.. అక్కడుం డే పౌరుల విలువలు కూడా ఇందులో కీలకమే’ అని ప్రధాని చెప్పారు.

వందేళ్ల వేడుకల ముగింపు కార్యక్రమం

శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులంలో ఆదివారం జరిగిన వందేళ్ల వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19 భాషలలో అనువదించి న శ్రీ సిద్ధాంత్ శిఖామణి గ్రంథాన్ని విడుదలచేసి, మొబైల్ అప్లికేషన్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో
యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్నాటక సీఎం బీఎస్ యెడియూరప్ప పాల్గొన్నారు. అంతకుముందు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ సెం టర్ ను జాతికి అంకితం చేశారు. తర్వా త 63 అడుగుల ఎత్తైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహా-
న్ని మోడీ ఆవిష్కరిం చారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను సాధించే దిశగా తమ సర్కారు కృషిచేస్తోందని మోడీ చెప్పారు.  దళితులు, ఇతర బ లహీన వర్గాలను పైకితీసుకొచ్చేందుకు పాటుపడుతున్నట్లు వివరించారు. సమాజంలో చివరన ఉన్న వారికీ ప్రభుత్వ సంక్షేమ
ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ‘అంత్యోదయ’ కు అర్థం ఇదేనని మోడీ అన్నారు.

Latest Updates