అయోధ్య భూమి పూజ: రంగోళీ ట్వీట్‌ చేసిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో మందిరం నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రంగోళీని ట్వీట్‌ చేశారు. ఒక చిన్న గుడి ముందు ముగ్గుతో శ్రీరామ్‌ అని రాసిన ముగ్గు ఫొటోను ఆమె ట్వీట్‌ చేశారు. “ చాలా ఇళ్లలో ప్రతి రోజు రంగోళీ / కోలమ్‌ను వేస్తారు. బియ్యంపిండితో ప్రతి రోజు ఫ్రెష్‌గా వేసుకుంటారు. మా ఇంటి దగ్గర్లోని ఒక చిన్న గుడిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇలా వేశారు” అని మంత్రి ట్వీట్‌ చేశారు. ఈ మేరకు గుడి ముందు రంగోళీ వేసిన ఫొటోలు కూడా పోస్ట్‌ చేశారు. ‘అయోధ్య భూమి పూజన్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఉంచారు. ఎన్నో కోట్ల హిందువులు, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమం రామమందిరం నిర్మాణం ఈ రోజు షురూ కానుంది. ఈ మేరకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా హిందువులు ప్రత్యేక పూజలు చేస్తూ, దీపాలు వెలిగిస్తూ సంతోషంగా జరుపుకుంటున్నారు.

 

Latest Updates