మదర్స్ డే రోజు కవలలకు జన్మనిచ్చిన ఐరన్ లేడీ

సామాజిక హక్కుల కార్యకర్త, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఇరోమ్ షర్మిల కవలలకు జన్మనిచ్చారు. మాతృదినోత్సవం రోజున ఆమె కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని క్లౌడ్ నైన్ ఆస్పత్రిలో ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు షర్మిల సన్నిహితురాలు దివ్యభారతి ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు. 16ఏళ్ల దీక్ష విరమణ తర్వాత కొడైకెనాల్‌లో స్థిరపడ్డ షర్మిల.. ప్రెగ్నెన్సీ కోసం గతేడాది బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. షర్మిల తన కవల పిల్లలకు నిక్స్ సఖి, ఆటమ్ తారా అని పేర్లు పెట్టారు.

మణిపూర్‌లో పౌరహక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన షర్మిల 2017 ఆగస్టులో బ్రిటీష్ బాయ్ ఫ్రెండ్ డేస్‌మోండ్ ఆంథోని బెల్లర్మిన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారు కొడైకెనాల్‌లోనే సెటిల్ అయ్యారు.

Latest Updates