రెండు వేల నోట్లనూ రద్దు చేయాలి.. ఎస్‌‌సీ గార్గ్‌‌

న్యూఢిల్లీ : పాత రూ.500, రూ.1000 నోట్లకు బదులుగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల నోట్లను కూడా రద్దు చేయాలని ఆర్థిక వ్యవహారాల మాజీ సెక్రటరీ సుభాష్​ చంద్ర గార్గ్ పిలుపునిచ్చారు. డిమానిటైజేష్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు వేల నోట్లను దాచిపెడుతున్నారని, వాటిని కూడా డిమానిటైజేష్ చేయాలని సూచించారు. మూడేళ్ల క్రితం నవంబర్ 8న మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రెండు వేల నోట్లను ప్రవేశపెట్టారు. ‘సిస్టమ్‌‌లో నగదు చాలా ఉంది. రెండు వేల నోట్లను కూడా స్టాక్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు విస్తరిస్తున్నాయి. ఇండియాలో కూడా ఇదే జరుగుతుంది. కానీ గ్లోబల్‌‌గా పోలిస్తే కాస్త తక్కువగా ఉంది’ అని గార్గ్ అన్నారు. వాల్యు టర్మ్స్‌‌లో సర్క్యూలేషన్‌‌లో ఉన్న కరెన్సీ నోట్లలో మూడింట ఒక వంతే రెండు వేల నోట్లు ఉన్నాయని చెప్పారు. రెండు వేల నోట్లు సర్క్యూలేషన్‌‌లోకి రాకుండా.. దాచిపెడుతున్నారని, కరెన్సీ లావాదేవీలలో ఇది కనిపించడం లేదన్నారు. దీని డిమానిటైజ్ చేయడమో లేదా సర్క్యూలేషన్ నుంచి విత్‌‌డ్రా చేయడమో  చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా దీన్ని డిమానిటైజ్ చేయాలన్నారు.  గార్గ్ ప్రభుత్వ సర్వీసు నుంచి వాలంటరీ రిటైర్‌‌‌‌మెంట్ తీసుకుని, తన బాధ్యతల నుంచి వైదొలిగారు.

Latest Updates