తెలంగాణకు 21 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పోలీస్ విభాగంలో 14.. ఫైర్, హోంగార్డు సర్వీసుల్లో 7

తెలంగాణకు 21 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పోలీస్ విభాగంలో 14.. ఫైర్, హోంగార్డు సర్వీసుల్లో 7

 

 

  • కానిస్టేబుల్ రాజునాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతిష్టాత్మక గ్యాలంటరీ అవార్డు
  • ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్స్, 18 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ 
  • దేశవ్యాప్తంగా 1,090 మందికి మెడల్స్ ప్రకటించిన కేంద్రం  

న్యూఢిల్లీ, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 21 మెడల్స్​ దక్కాయి. పోలీస్ విభాగంలో 14.. ఫైర్, హోంగార్డు సర్వీసుల్లో 7 మెడల్స్ లభించాయి. కానిస్టేబుల్ ఎస్. రాజు నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతిష్టాత్మకమైన గ్యాలంటరీ అవార్డు దక్కింది. ఏఎస్ఐ ఎం. సిద్ధయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. డీసీపీలు నల్లమల రవి, టి. కరుణాకర్, జె.షేక్ షమీర్, కమాండెంట్ పుట్ట దేవిదాస్, ఆర్మ్​డ్​ పోలీస్ సబ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు మేకల అబ్రహం, షిండె ప్రకాశ్, ముదావత్ దశరథ్, రాందులార్ సింగ్, ఏఎస్సైలు ఎం. మొహిజొద్దీన్, రాజేషుని శ్రీనివాస్, రుద్రక్రిష్ణ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ లభించాయి.

 ఇక ఫైర్ సర్వీసుల్లో లీడింగ్ ఫైర్‌‌‌‌మెన్లు కేడబ్ల్యూ మహ్మద్, టల్ల నగేశ్, ఎం.సాధిక్, బిరెడ్డి గోపాల్ రెడ్డి, కరెక్షనల్(జైలు) సర్వీసుల్లో డిప్యూటీ జైలర్ రాజు చక్రాల, హోంగార్డులు రాజు జోన్నడ, సంఘం పిసారిలకు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి. కాగా, దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసులకు సంబంధించి మొత్తం 1,090 మెడల్స్‌‌ను కేంద్రం ప్రకటించింది. ఇందులో 233 మందికి గ్యాలంటరీ అవార్డులు, 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 758 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి.