భూతగాదా వల్ల గొడ్డలితో దాడి

జగిత్యాల టౌన్లో దారుణం జరిగింది. భూతగాదా విషయంలో తిప్పర్తి కిషన్ పై కత్రోజ్ లక్ష్మణ్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. బైక్ లో గొడ్డలి పెట్టుకొని వచ్చిన లక్ష్మణ్ నడిరోడ్డుపై అంతా చూస్తుండగా కిషన్ పై దాడి చేశాడు.  దీంతో.. గాయపడిన కిషన్ ను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.

ఐదేళ్లకింద కిషన్ ఒక భూమిని లక్ష్మణ్ కు అమ్మినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే పట్టా చేసివ్వకపోవడంతో ఇరువురి మధ్య తగాదా ఏర్పడింది. పట్టా చేసివ్వక పోతే తన ధనాన్ని తనకు ఇవ్వమని లక్ష్మణ్ కోరగా.. కిషన్ వినిపించుకోలేదని పోలీసులు చెప్పారు. దీంతో లక్ష్మణ్ కు కిషన్ కు పలు మార్లు గొడవ జరిగిందని తెలిపారు. అయితే ఈ సారి మాత్రం కిషన్ ఇంటికి వెళ్లిన లక్ష్మణ్ నగదు ఇవ్వమని కోరగా అందుకు కిషన్ విముకత చూపలేదు. దీంతో కిషన్ పై గొడ్డలితో దాడి చేశాడు లక్ష్మణ్. పోలీసులు లక్ష్మణ్ కోసం గాలిస్తున్నారు

Latest Updates