సుశాంత్ ఫిట్ గా ఉన్నాడు : రియా బ‌ల‌వంతంగా మెడిసిన్ ఇచ్చింది

సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఓ ఛాన‌ల్ నిర్వ‌హించిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫిట్ నెస్ ట్రైనర్ సామి అహ్మద్ షాకింగ్ విష‌యాల్ని వెల్ల‌డించారు. త‌న‌ అనుమ‌తి లేకుండా మెడిసిన్ తీసుకునేందుకు సుషాంత్ ఇష్ట‌ప‌డ‌లేద‌ని, కానీ రియా ఆ మెడిసిన్ ను బ‌లవంతంగా ఇచ్చిన‌ట్లు స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో చెప్పాడు. ఆ మెడిసిన్ ను తీసుకోవ‌ద్ద‌ని సుశాంత్ కు చెప్ప‌డం రియాకు న‌చ్చ‌లేద‌ని అహ్మ‌ద్ చెప్పాడు. అందుకే త‌న‌ను సుశాంత్ నుంచి దూరం చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు.

సుశాంత్ డిప్రెష‌న్ లో ఉన్నాడా..?

సుశాంత్ డిప్రెష‌న్ లో ఉన్నారా ఛాన‌ల్ ప్ర‌తినిధి అడ‌గ్గా..డిప్రెష‌న్ లో ఉంటే ఫ‌స్ట్ కౌన్సెలింగ్ పాల్గొనాలి. కానీ కౌన్సెలింగ్ జరిగిన‌ట్లు లేద‌న్నాడు.

సుశాంత్ చాలా ఫిట్ గా ఉంటాడు

స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో అహ్మ‌ద్ మాట్లాడుతూ సుశాంత్ చాలా ఫిట్ గా ఉన్నాడు. వ‌ర్కౌట్ గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటారు. జంక్ ఫుడ్ విష‌యంలో క‌ఠినంగా ఉన్నార‌ని చెప్పాడు.

మెడిసిన్ ఎందుకు తీసుకున్నారో..?

రియాపై అనుమానం వ్య‌క్తం చేస్తూ అతనికి తెలియకుండానే సైకోట్రోపిక్ మెడిసిన్ ను ఇంజెక్ట్ చేశారా? అతను ఎందుకు మెడిసిన్ ను ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందంటూ అనుమానం వ్య‌క్తం చేశాడు.

Latest Updates