బక్రీద్ రోజున కిడ్నాపైన పాప దొరికింది

సికింద్రాబాద్ : బక్రీద్ పర్వదినాన యాప్రాల్ కు చెందిన 5 ఏళ్ల పాప ఫాతిమాను ఓ వ్యక్తి నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఈ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ షేక్ సలీమ్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ ను పట్టుకోవడానికి పోలీసులు 20 టీంలుగా ఏర్పడి సిటీ మొత్తం సెర్చ్ చేశారని తెలిపారు ACP బిక్షంరెడ్డి. అయితే తనకు ఆడబిడ్డలు లేరని పెంచుకుందామని బాలికను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు చెప్పాడని తెలిపారు పోలీసులు. అది నిజమా లేక ఇతనిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. చిన్నారిని వైద్య పరీక్షల తర్వాత తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు.

SEE ALSO- పాల కోసం వస్తే పాపను ఎత్తుకెళ్లాడు

Latest Updates