31 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు సచిన్..

క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండుల్కర్ నవంబర్ 15,1989 న ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన రోజు. అంటే సరిగ్గా ఇవాళ్టికి సచిన్ మొదటి మ్యాచ్ ఆడి 31 సంవత్సరాలు . సచిన్ తన 16 ఏళ్ల వయసులో  కరాచీలో పాకిస్తాన్ తో మొదటి డెబ్యూ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో సచిన్ కేవలం 15 పరుగులు చేసి వకార్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మొదటి మ్యాచ్ లో నిరుత్సాహ పరిచినా తర్వాత  ఏ మాత్రం వెనకడుగు వేయని సచిన్  అంతర్జాతీయ క్రికెట్ లో కోట్లాడి అభిమానులను సంపాదించుకున్నాడు. 24 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో  100 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని భావితరాలకు సవాల్ విసిరాడు. 2013 లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

నవంబర్ 15, 2013 న సచిన్ తన చివరి మ్యాచ్  ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడాడు.  వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో  సచిన్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో  భారత్ ఇన్నింగ్స్, 126 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సచిన్ ఇండియా తరపున  200 టెస్టులు ఆడి, టెస్టులు, వన్డేల్లో కలిపి 100 సెంచరీలు సాధించాడు. 463 వన్డేల్లో టెండూల్కర్ 49 సెంచరీలతో కలిపి  18,426 పరుగులు చేశాడు, టెస్టుల్లో 51 సెంచరీలతో కలిపి 15,921 పరుగులు చేశాడు.  2006 లో దక్షిణాఫ్రికాతో  ఒక టి20 మ్యాచ్ ఆడాడు, దీనిలో  సచిన్ 10 పరుగులు చేశాడు.

Latest Updates