ధోనీని ఏ ప్రాతిపదికన టీంలోకి తీసుకుంటారు?

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌‌‌‌ జరగకపోతే.. మాజీ సారథి మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమేనని గౌతమ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ అన్నాడు. దాదాపు ఏడాదిన్నరగా క్రికెట్‌‌‌‌కు దూరంగా ఉంటున్న మహీని ఏ బేసిస్‌‌‌‌ మీద సెలెక్టర్లు టీమ్‌‌‌‌లోకి తీసుకుంటారని ప్రశ్నించాడు. ‘ధోనీ ఫ్యూచర్‌‌‌‌ మొత్తం ఐపీఎల్‌‌‌‌ మీదే ఆధారపడి ఉంది. మిగతా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా టీమ్‌‌‌‌లోకి రావడం అసాధ్యం. ఒకవేళ తీసుకున్నా రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. కీపింగ్‌‌‌‌లో ధోనీతో పోలిస్తే రాహుల్‌‌‌‌ బెటర్‌‌‌‌ కాకపోయినా.. ప్రస్తుతం సెలెక్టర్ల ముందున్న అప్షన్‌‌‌‌ ఇదే. టీ20ల్లో రాహుల్‌‌‌‌ రెండు రకాలుగా ఉపయోగపడతాడు. కీపింగ్‌‌‌‌తో పాటు మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌‌‌‌ చేసే సత్తా ఉంది. ఏదేమైనా బెస్ట్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చూపిన ప్లేయర్లు, ఇండియాకు విజయాలు అందించే సామర్థ్యం ఉన్నవాళ్లే టీమ్‌‌‌‌లో ఉండాలన్నది నా అభిప్రాయం’ అని గంభీర్‌‌‌‌ పేర్కొన్నాడు. కెరీర్‌‌‌‌కు వీడ్కోలు చెప్పే అంశం ధోనీ వ్యక్తిగతమన్నాడు. మరోవైపు మరో రెండు, మూడు ఐపీఎల్‌‌‌‌లు ఆడే సత్తా ధోనీకి ఉందని హైదరాబాద్‌‌‌‌ మాజీ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ వీవీఎస్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ అభిప్రాయపడ్డాడు.

Latest Updates