సచివాలయం కూల్చివేతపై ముగిసిన‌ విచారణ

సచివాలయ భవనాల కూల్చివేతపై విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది‌ హైకోర్టు. దీంతో భవనాల కూల్చివేతపై స్టే రేపటివరకు కొనసాగుతుంద‌ని తెలిపింది. సచివాలయం కూల్చివేతపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ చేప‌ట్టింది. ఎన్విరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జ్ మెంట్ లను సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది ఏజీ.
భవనాల కూల్చివేతకు ఎన్విరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరంలేదని పలు జడ్జ్ మెంట్ లు ఉన్నాయని తెలిపింది ఏజీ.

ప్రభుత్వ కౌంటర్ కు రీప్లై కౌంటర్ ధాఖలు చేశారు పిటీషనర్ చిక్కుడు ప్రభాకర్. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018కి విరుద్దంగా కూల్చివేత పనులు చేపడుతున్నారన్నారు పిటీషనర్ తరపు న్యాయవాది. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్ రీజర్వమెంట్స్ తీసుకోవాలని పేర్కొన్నారు పిటీషనర్ తరపు న్యాయవాది. లీగల్ రీజర్వ్ మెంట్స్ పై వివరణ ఇవ్వాలని పిటీషనర్ ను కోరింది హైకోర్టు.

పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఎం చెపుతుందో తెలపాలని పిటిషనర్ కు సూచించింది హైకోర్టు. భవనాల కూల్చివేతకు సెంట్రల్ మినిస్ట్రీరీ అనుమతి తీసుకోలేదన్నారు పిటీషనర్. ఒక ప్రాజెక్టు నిర్మించడానికి మాత్రమే సెంట్రల్ మినిస్ట్రీరీ అనుమతి అవసరమని కోర్టుకు తెలిపింది ఏజీ. ఎన్వీరాన్ మెంట్ ప్రోటక్షన్ యాక్ట్ ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని సూచించింది హైకోర్టు. ఎన్వీరాన్ మెంట్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా అనుమతి అసలు తీసుకున్నారా అని ప్రశ్నించింది హైకోర్టు. భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని , కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని తెలిపింది ఏజీ. ఇప్పుడు తాము ఎలాంటి నిర్మాణం చేపట్టడంలేదని కోర్టుకు తెలిపింది ఏజీ.

నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటాని హైకోర్టుకు తెలిపింది ఏజీ. జీహెచ్ఎంసీ, లోకల్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు తీసుకున్నామని కోర్టుకు తెలిపింది ఏజీ. సోలిసీటర్ జనరల్ రేపు విచారణకు హాజరు కావాలని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.

Latest Updates