మంచుకొండల కింద చిక్కుకున్న ఆరుగురు జవాన్లు: ఒక మృతదేహం వెలికితీత

జవాన్లకు సరిహద్దుల్లో శత్రువులతో పాటు ప్రకృతి నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. అటు శత్రువులతో పోరాటంలో ప్రాణాలు పోతుంటే.. ఇటు మంచు కొండలు కూలి తరచూ జవాన్లు అమరులవుతున్నారు. బుధవారం హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు కొండలు విరిగి పడి ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చిక్కుకున్నారు. చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న కిన్నౌర్‌ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

ఉదయం 11 గంటల సమయంలో ఐటీబీపీ సైనికులు విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా మంచు కొండలు విరిగి పడ్డాయి. వాటి కింద ఆరుగురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఐటీబీపీ, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఒక జవాను మృత దేహాన్ని వెలికి తీశారు. మిగిలిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Latest Updates