సరిహద్దులో ఉగ్రవాదుల ల్యాండ్ మైన్.. ఆర్మీ ఆఫీసర్ బలి

జమ్ముకశ్మీర్ సరిహద్దు రేఖ వెంబడి ఉగ్రవాదులు ఆగడాలకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్ లో ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్ మైన్(ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్-ఐఈడీ) పేలింది. ఈ బాంబ్ ను డిఫ్యూజ్ చేస్తుండగా పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో మేజర్ ర్యాంక్ ఇంజినీర్, ఆర్మీ అధికారి చిత్రేష్ సింగ్ బిస్త్ ప్రాణాలు కోల్పోయారు. లైన్ ఆఫ్ కంట్రోల్ కు లోపలే 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఐఈడీని అమర్చారు టెర్రరిస్టులు.  చొరబాటుదారుల దురాగతాలకు ఈ దారుణం ఓ ఉదాహరణ.

 

Latest Updates