రెండు తలలతో శిశువు : ఐదో నెలలోనే ప్రసవం

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని Dangoriya ప్రైవేటు హాస్పిటల్ లో భిన్నమైన ప్రసూతి కేసు నమోదైంది. గర్భంలో శిశువుకు రెండుతలలు ఉండటమే కాదు.. పలు రకాల జన్యు లోపాలు ఉండటంతో..  ఐదో నెలలోనే డెలివరీ చేశారు. మృత శిశువును బయటకు తీశారు డాక్టర్లు.

నాలుగో నెలలో ఉన్నప్పుడు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ లో.. ఓ గర్భిణీ కడుపులో రెండు తలలతో శిశువు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ కేసును పరిశీలించిన హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్, డాక్టర్ లీల… చిన్నారికి పలు రకాలైన జన్యులోపాలు ఉన్నట్టు గుర్తించారు. శిశువు రెండు తలలతో ఉండటమే కాకుండా గుండెలో, మెదడులో లోపాలు ఉన్నట్టు తెల్సుకున్నారు. శిశువు పుట్టినా మనుగడ సాగించడం కష్టమని తేల్చి.. తల్లిదండ్రులకు పరిస్థితి వివరించారు. ఐదో నెలలోనే మృత శిశువును డెలివరీ చేశారు.

ఇది మెడికల్ ఫీల్డ్ లోనే అరుదైన సంఘటన అని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి జన్యుపరమైన సమస్య కోటి మందిలో ఒకరికి వస్తుందని చెప్పారు. సాధారణంగా ఒక లోపంతో కాకుండా.. రెండు తలలతో పూర్తిగా అవయవాలు ఎదగకుండా.. పలురకాలైన లోపాలతో పుట్టే పిల్లలు పుట్టాక బతకలేరని వివరించారు.

Latest Updates