సోషల్ మీడియాలో వారానికో కొత్త చాలెంజ్

సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు చాలెంజ్ విసురుకోవడంలో తలమునకలు

వారానికో ఛాలెంజ్ పుట్టిస్తున్నారు

కొత్త ట్రెండ్: సింగిల్స్ చాలెంజ్.. కపుల్ చాలెంజ్  

వాట్సాప్‌‌‌‌లో స్టేటస్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌లు మస్త్​  వైరల్

సోషల్‌‌‌‌ మీడియాలో వారానికో చాలెంజ్‌‌‌‌ పుట్టుకొస్తుంటుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఒకరిపై ఒకరు ఆ చాలెంజ్‌‌‌‌లను విసురుకుంటున్నరు. దాంతో అవి కాస్తా వైరల్‌‌‌‌ అవుతున్నయ్​. వాటిలో కొన్ని చాలెంజ్‌‌‌‌లు మాత్రం విపరీతంగా ఫేమస్‌‌‌‌ కూడా అయితున్నయ్​​. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ మొదలైనప్పుడు వాట్సాప్‌‌‌‌లో స్టేటస్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌లు మస్త్​  వైరల్‌‌‌‌ అయింది​. లూజ్​ హెయిర్‌‌‌‌‌‌‌‌ చాలెంజ్‌‌‌‌ అని, లిప్‌‌‌‌స్టిక్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌ అని రకరకాల చాలెంజ్‌‌‌‌లు స్టార్ట్‌‌‌‌ అయినయ్​. గతంలో గ్రీన్‌‌‌‌చాలెంజ్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌ లాంటివి కూడా వచ్చినయి. వాటిలో సెలబ్రిటీలు కూడా పాల్గొన్నరు. అయితే ఇప్పుడు కపుల్స్‌‌‌‌ చాలెంజ్, సింగిల్స్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌ జమానా నడుస్తోంది.

ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, ట్విట్టర్‌‌‌‌‌‌‌‌.. ఏది ఓపెన్‌‌‌‌ చేసినా.. కుప్పలు కుప్పలుగా  కపుల్‌‌‌‌ ఫొటోలు కనిపిస్తున్నయ్‌‌‌‌. ఇంక కొంచెం కిందికి స్క్రోల్‌‌‌‌ చేస్తే.. సింగిల్స్‌‌‌‌ ఫొటోలు అగుపిస్తున్నయ్‌‌‌‌. ఏంది ఇది అని అనుకుంటూనే ఇంక కొంచెం స్క్రోల్‌‌‌‌ చేస్తే ఫేవరెట్‌‌‌‌ లీడర్లతో దిగిన ఫొటోలు పెట్టి ‘ఫేవరెట్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ చాలెంజ్‌‌‌‌’ అనే హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌ తగిలిచ్చిండ్రు. దాంతో ఆగట్లే! రోజుకో కొత్త చాలెంజ్‌‌‌‌ తీసుకొస్తున్నరు. ఇప్పుడు ఇక ఏజ్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌ అని పుట్టించిండ్రు.

కపుల్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌

ఈ చాలెంజ్‌‌‌‌ ఎవరు స్టార్ట్‌‌‌‌ చేసిండ్రో.. ఎవరు ఎవరికి విసిరిండ్రో తెలీదు. కానీ, సోషల్‌‌‌‌మీడియాలో మాత్రం ఫుల్​  వైరల్‌‌‌‌ అవుతోంది. #Couplechallenge అని ఒక హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌ తగిలించి జీవిత భాగస్వామితో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌‌‌‌ చేస్తున్నరు కపుల్స్‌‌‌‌. కొంత మందైతే వాళ్ల అమ్మనాన్న ఫొటోలను పోస్ట్‌‌‌‌ చేస్తున్నరు. దీంతో దాదాపు వారం నుంచి ఆ హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌ విపరీతంగా ట్రెండ్‌‌‌‌ అవుతున్నయ్​.

సింగిల్స్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌

‘కపుల్స్‌‌‌‌ ఫొటోలు పెడితే మేము  ఏమన్నా  తక్కువ తిన్నమా’! అనుకున్నరేమో సింగిల్స్‌‌‌‌ వాళ్లు కూడా ఒక చాలెంజ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసిండ్రు. గ్యాలరీలోని ది బెస్ట్‌‌‌‌ ఫొటోలను పోస్ట్‌‌‌‌ చేసి ‘ఫర్‌‌‌‌‌‌‌‌ఎవర్‌‌‌‌‌‌‌‌ సింగిల్‌‌‌‌’, ‘సింగిల్స్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌’ అని పోస్టులు పెడుతున్నరు. త్వరలో ‘మేము మింగిల్‌‌‌‌ అయితం, ఫొటోలు పెడతం’ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నరు. దీంతో పాటు ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ఏజ్‌‌‌‌చాలెంజ్‌‌‌‌ కూడా మొదలైంది. ఆ చాలెంజ్‌‌‌‌లో ఏజ్‌‌‌‌కు తగ్గట్లు ఒక ఫొటో పెట్టి. వాళ్ల ఏజ్‌‌‌‌ను పోస్ట్‌‌‌‌ చేయాలి. దాంతో పాటు గడ్డం చాలెంజ్‌‌‌‌, ఫార్మర్‌‌‌‌‌‌‌‌ చాలెంజ్‌‌‌‌ లాంటివి కూడా వైరల్‌‌‌‌ అయ్యాయి.

యూపీ మ్యాన్‌‌‌‌ కపుల్‌‌‌‌ ఫొటో వైరల్‌‌‌‌

కపుల్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌లో భాగంగా యూపీకి చెందిన ఒక వ్యక్తి   చేసిన పోప్ట్​ ఇంటర్నెట్​లో నవ్వులు పూయించింది.  తన పొలంలో ప్రముఖ యాక్టర్‌‌‌‌‌‌‌‌ అలగ్జాంద్రా దదోరియాతో  సెల్ఫీ దిగినట్లు ట్వీట్‌‌‌‌ చేసిన  ఆ ఫొటో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే  ఫుల్​ వైరల్​ అయింది. ‘హేటర్స్‌‌‌‌ దీన్ని ఫొటో షాప్‌‌‌‌ అనుకుంటారు. కానీ కాదు’ అని ఆయన పోస్ట్‌‌‌‌ చేయడంతో దానిపై విపరీతమైన మీమ్స్‌‌‌‌ కూడా వచ్చాయి. ఆ వైరల్‌‌‌‌ అయిన ఫొటో కాస్తా నటి కంట్లో పడటంతో ఆమె కూడా దాన్ని చాలా ఎంజాయ్‌‌‌‌ చేశారు. దాన్ని తన ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ ఎకౌంట్‌‌‌‌లో రీట్వీట్‌‌‌‌ కూడా చేశారు. ఇదే ఫన్నీ వీకెండ్‌‌‌‌ అంటూ ట్వీట్‌‌‌‌ చేశారు.

చాలెంజ్‌‌‌‌లతో జాగ్రత్త

ఈ చాలెంజ్​ చూడ్డానికి బాగానే ఉన్నా ఫ్యూచర్​లో మాత్రం ​ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడతాయి అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. వైరల్‌‌‌‌ అయిన హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌తో పోస్టులు పెడితే దానికి రీచ్‌‌‌‌ ఎక్కువగా వస్తుందని, దానివల్ల మన ఫొటోలు మిస్‌‌‌‌యూజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దాని కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పోస్ట్‌‌‌‌ చేస్తే సేఫ్‌‌‌‌ అని అంటున్నారు. సెక్యూరిటీ సెట్టింగ్స్‌‌‌‌ చూసుకొని ఫొటోలు పోస్ట్‌‌‌‌ చేయాలని సూచిస్తున్నారు. కేవలం మన ఫ్రెండ్స్‌‌‌‌కి మాత్రమే ఫొటోలు కనిపించేలా సెట్టింగ్స్‌‌‌‌ ఉంచాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో తెలియని వాళ్లు ఉంటే వాళ్లను అన్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ చేయాలని, పోస్ట్‌‌‌‌ చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

Latest Updates