ఫ్రెండ్లీ పోలీస్ : షూ లేస్ కట్టి గర్భిణికి సహాయపడ్డాడు

ఇండియాలో పోలీస్ అన్న పేరు వినగానే తెలియని ఏదో ఒక జర్క్ తగులుతుంది. సిస్టమ్ అలా ఉంది మరి. మనదేశంలోనూ మంచి పోలీసులు లేకపోలేదు. కానీ… పోలీస్ అంటే ఓ అజమాయిషీ… పోలీస్ అంటే కొంత పొగరు.. పోలీస్ అంటే ఎవరినీ లెక్కచేయని తనం.. అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది.

చైనాలో పోలిసింగ్ సంగతేమో కానీ.. ఓ పోలిస్ మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో మన్ననలు పొందుతున్నాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అసలైన డెఫినిషన్ అనిపిస్తున్నాడు. బీజింగ్ లో ఉండే మిసెస్ వాంగ్ అనే మహిళ… షాపింగ్ కోసం ఓ మాల్ కు వెళ్లింది. ఆమె ఏడు నెలల గర్భిణి. షాపింగ్ చేసిన ఆమె తన రెండు చేతులతో బ్యాగ్స్ పట్టుకుని వస్తుండగా.. షూ లేస్ ఊడిపోయింది. అక్కడే ఉన్న ఓ పోలిస్ అది గమనించాడు. షూ లేస్ కట్టుకోవడానికి ఆమె ఇబ్బందిపడుతుండటాన్ని గమనించాడు. నేను సాయమందిస్తా అంటూ పర్మిషన్ తీసుకుని… ఆమె కాలు షూ లేస్ టై చేశాడు. ఆమె థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది.

సీన్ చాలా సింపుల్. కానీ.. ఇది ఇస్తున్న మెసేజ్ మాత్రం వండ్రఫుల్. పోలీస్ అంటే ఇంత దయాగుణం కలిగిఉంటారా అని నెట్ లోకం అంటోంది. పోలీసులు ఎంత కరకుగా ఉన్నా.. మనుషుల అవస్థలను అర్థం చేసుకుని.. ఏ ఉద్దేశం లేకుండా సేవ చేయడానికి ముందుకొస్తే మరింత బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అనే మాట…. చేతల్లోనే ఎక్కువ మందికి చేరువవుతుందని అంటున్నారు.

Latest Updates