ఏపీలో 9,136 మందికి టెస్టులు.. 47 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 9,136 మంది నమూనాలను పరీక్షించగా.. 47 మందికి పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ శనివారం ప్రకటించింది. వైరస్ బారినపడి ట్రీట్​మెంట్ పొందుతూ శుక్రవారం కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారని, దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 56 కు పెరిగిందని ప్రకటించింది. తాజా కేసుల్లో ఎక్కువ శాతం చెన్నైలోని కొయంబేడు మార్కెట్​తో ముడిపడినవేనని తెలిపింది. శుక్రవారం వివిధ ఆస్పత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ కాగా.. 727 మందికి ట్రీట్ మెంట్ కొనసాగుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,714 కు పెరిగింది.

Latest Updates