కశ్మీర్ లో ఉగ్రదాడి..జవాన్ మృతి

జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. చదూరా ఏరియాలో CRPF పార్టీపై దాడి చేశారు. మోటర్ సైకిల్ పై వచ్చిన టెర్రరిస్టులు… CRPF ట్రూప్స్ పై ఫైరింగ్ చేశారు. వారి దగ్గరున్న ఏకే 47 రైఫిల్ ను తీసుకుని పారిపోయారు. టెర్రర్ ఎటాక్ లో బుల్లెట్ గాయాలతో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.

అటు పుల్వామాలో కశ్మీర్ పోలీసులు, ఉగ్రవాదుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. మచ్చిహోమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో… సెర్చ్ చేశారు. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరింతమంది దాగి ఉన్నారన్న సమాచారంతో… ఉగ్రవేట కొనసాగిస్తున్నారు. టెర్రరిస్ట్ మృతిచెందిన ప్రాంతంలో… ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

గాంధీ భారత్‌‌లో కలిశాం.. మోడీ ఇండియాలో కాదు

Latest Updates