జపాన్‌‌లో ట్రక్కును ఢీకొట్టిన రైలు

జపాన్‌‌ రాజధాని టోక్యో దగ్గర్లో గురువారం రైలు ప్రమాదం జరిగింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు ప్రమాదవశాత్తు ట్రక్కును గుద్దుకోవడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ట్రక్కు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌‌గా ఉందని అధికారులు చెప్పారు. ట్రక్కును చూసి డ్రైవర్‌‌‌‌ బ్రేక్‌‌ వేసినప్పటికీ స్పీడ్‌‌ కంట్రోల్‌‌ కాలేదని, దీనిపై విచారణకు ఆదేశించామని పోలీసులు చెప్పారు.

Latest Updates