మియాపూర్ లో హోటల్ లోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

మియాపూర్  లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రెండు వాహనాలను ఢీ కొట్టి హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్ లో ఉన్న వ్యక్తి ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు.  మరో నలుగురికి  గాయాలయ్యాయి. టూ వీలర్ వెహికిల్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని బీహెచ్ఈఎల్ కి  చెందిన అఫ్సర్ గా గుర్తించారు.  మరో రెండు ద్విచక్ర వాహనాలు ద్వంసమయ్యాయి. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

see more news

దెయ్యాలను 12 ట్రక్కుల్లో రోజుకు మూడుట్రిప్పుల్లో తరలించారంట.!

కొడుకు తాగుతున్నాడని.. చంపి ముక్కలు చేసిన తల్లి

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates