జనసేన సభలో యువకుడు మృతి

కర్నూలు జిల్లా నంద్యాలలోని జనసేన బహిరంగ సభలో అపశృతి జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సిరాజ్ అనే యువకుడు మృతిచెందాడు.

సభ దగ్గర స్పీకర్లకు ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు కిందపడిపోయి ఒకిరి మీద ఒకరు పడిపోయారు. దీంతో సిరాజ్ అనే యువకుడు(30) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే నంద్యాలలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటుండగానే సిరాజ్  మృతి చెందాడు. సిరాజ్ ఆటో డ్రైవర్ అని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest Updates