మొయినాబాద్ లో కారు బీభత్సం..ఒకరు మృతి

హైదరాబాద్ మొయినాబాద్ లో  కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్ తో  వెళ్తున్న కారు దాని ముందున్న బైక్ ను ఢీ కొట్టింది.  దీంతో బైక్ పై వెళ్తున్న రజాక్ అనే వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హాజి అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రజాక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

Latest Updates