ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీ కొట్టిన డీసీఎం

శంషాబాద్  ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కోత్వాల్ వద్ద  లారీని డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంగారెడ్డికి చెందిన కుమ్మరి యాదయ్య(50)  మృతి చెందగా.. యాదయ్య కుమారుడు కుమ్మరి శ్రీను(30)కు తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి నుండి చెన్నై వెళ్తున్న డీసీఎం, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గూడ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని డీసీఎం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతిచెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అతివేగం మద్యం మత్తు, నిర్లక్ష్యం డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనుకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా 133 పాయింట్స్ వచ్చింది. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

see more news

కోడళ్లంటే వీళ్లే.. అత్తకు గుడి కట్టి పూజలు, భజనలు

కాళేశ్వరంలో భారీ అవినీతి.. కొన్నది 1686 కోట్లు..లెక్కల్లో చూపించింది 7348 కోట్లు

‘పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులు‘

ఒక్కో ఇంటికి కేంద్రం వాటా లక్షన్నర.. మోడీ ఫోటో ఎక్కడ.?

Latest Updates