అమానుషం : 8వ ఫ్లోర్ నుంచి కుక్కపిల్లలను విసిరేశాడు

one-doctor-throw-two-puppies-from-8th-floor-in-gurgram-240587-2

హర్యానా : కుక్కలు మానవత్వం చూపిస్తుంటే.. ఓ మనిషి రాక్షసుడిగా మారాడు. విశ్వాసానికి మారుపేరుగా కుక్కలు తమ పేరు నిలబెట్టుకుంటుంటే… ఓ మనిషి మాత్రం తనలోని మృగాన్ని చూపించాడు. చిన్న కుక్కపిల్లలను చాలా ఎత్తున్న బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేయడంతో.. అవి ప్రాణాలు కోల్పోయాయి. ఈ అమానుష సంఘటన ఢిల్లీ శివారు గుర్ గ్రామ్ లో జరిగింది.

గుర్ గ్రామ్ ఎమార్ ఎమరాల్డ్ ఎస్టేట్ లో ఈ దారుణం జరిగింది. ఇరాక్ దేశానికి చెందిన ఓ డాక్టర్ 8వ ఫ్లోర్ లో ఉంటున్నాడు. అక్కడినుంచి 2 కుక్కపిల్లలను ఒకదాని వెంట మరొకదాన్ని విసిరేశాడు. రెండు పప్పీలు అక్కడికక్కడే చనిపోయాయి. ఈ దారుణాన్ని అపార్టుమెంట్ ఆవరణలోని ఓ మహిళ చూసింది. కోపంతో.. అపార్టుమెంట్ వాసులతో కలిసి అతడిని నిలదీసింది. జంతు సంరక్షణకు కృషిచేస్తున్న స్థానిక NGOకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కూడా స్పందించారు. సీసీ పుటేజ్ చూసి.. కుక్కపిల్లలను విసిరేసి చంపింది నిజమే అని నిర్ధారించారు. ఐతే.. ఈ సంఘటనపై ఇప్పటివరకు కేసు నమోదుచేయలేదు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Latest Updates